న్యూఢిల్లీ : ఇటీవల పాకిస్థాన్‌పై భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌పై ఈ నెల 1 నుంచి 30 వరకు దేశ వ్యాప్తంగా వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్టు రక్షణ శాఖ ఆదివారం ప్రకటించింది.
ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన మొదటి ముగ్గురికి రూ.10 వేల చొప్పున బహుమతి అందజేయడమే కాక ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగే 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యే అవకాశం కల్పిస్తామని ఎక్స్‌లో తెలిపింది. అభ్యర్థులు ఆంగ్లం, హిందీలలో వ్యాసాలను పంపాలని కోరింది.