Rajnath Singh : పాకిస్తాన్ (Pakistan) ఆర్మీ చీఫ్ (Army chief) ఆసిమ్ మునీర్ (Asim Munir) పై భారత రక్షణ మంత్రి (Deffence Minister) రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) చురకలేశారు. భారత్‌ను ఫెరారీతో, పాక్‌ను చెత్తబండితో పోల్చిన మునీర్ వ్యాఖ్యలను రాజ్‌నాథ్ సింగ్ గుర్తుచేశారు. ఇది పాక్ ఫెయిలైందని మునీర్ ఒప్పుకోవడమేనన్నారు.
‘రెండు దేశాలకు ఒకే సమయంలో స్వాతంత్య్రం వచ్చింది. ఒక దేశం కష్టపడి బలమైన విధానాలు, ముందుచూపుతో ఫెరారీ లాంటి ఆర్థిక వ్యవస్థను నిర్మించుకుంది. మరో దేశం మాత్రం ఏ విధానాలూ లేకుండా చెత్తబండిలా మిగిలింది. అంటే అది కచ్చితంగా ఆ దేశం వైఫల్యమే. ఆసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలు ఈ తప్పును ఒప్పుకుంటూ చేసినవే’ అని సింగ్ అన్నారు.
కొన్ని రోజుల క్రితం యూఎస్‌లోని ఫ్లోరిడాలో పాకిస్తానీయులతో మునీర్ మాట్లాడారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌ను రాళ్లతో నిండిన చెత్తబండిగా పోల్చారు. ‘భారత్ ఫెరారీ లాంటిది. దాన్ని మన చెత్తబండి గుద్దితే ఎవరికి నష్టం..?’ అని మునీర్ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై నెట్టింట తెగ ట్రోలింగ్ జరిగింది.