Amit Shah : వచ్చే నెల 9న ఉప రాష్ట్రపతి ఎన్నికల (Vice President Election) పోలింగ్ జరగనుంది. అందుకోసం ఎన్నికల సంఘం (Election commission) సర్వం సిద్ధం చేస్తున్నది. అధికార, విపక్ష పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించి, నామినేషన్ కూడా వేయించాయి. ఈ నేపథ్యంలో ఉప రాష్ట్రపతి ఎన్నికలు హీటెక్కుతున్నాయి.
ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ప్రతిపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డి గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుదర్శన్ రెడ్డి నక్సలిజానికి మద్దతుగా తీర్పులు ఇచ్చారని ఆరోపించారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. సుదర్శన్ రెడ్డి సల్వా జుడుం తీర్పు వెలువరించకపోతే, దేశంలో తీవ్రవాద వామపక్ష ఉద్యమం 2020 కి ముందే ముగిసి ఉండేదని అన్నారు.