న్యూఢిల్లీ: భారత సాయుధ దళాల సామర్థ్యాలను మరింత బలోపేతం చేసేందుకు రూ. 52 వేల కోట్ల విలువైన ఆయుధాలు, సైనిక వ్యవస్థల కొనుగోలుకు రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని రక్షణ కొనుగోళ్ల మండలి(డీఏసీ) ఆమోదం తెలిపింది. ఈ నిధులతో ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్లకు అవసరమైన అధునాతన రక్షణ వ్యవస్థలను సమకూర్చనున్నారు.
వీటిలో ఆకాశ్ తరంగ్, మ్యాన్ ప్యాక్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్, వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, యాక్టివ్ ప్రొటెక్షన్ సిస్టమ్, జెట్ ఆధారిత కామికేజ్ డ్రోన్ సిస్టమ్ మొదలైనవి సైనిక దళానికి సమకూరనున్నాయి.