హింగోలి, ఆగస్టు 18: గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు ఎదుర్కొంటున్న దుస్థితిని తెలుసుకోవాలంటే రాజకీయ నాయకులు సైతం తమ పిల్లలను ఒక్కరోజైనా ఆ స్కూళ్లకు పంపాలని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే సూచించారు. గ్రామీణ విద్యార్థులు అనుభవిస్తున్న కష్టాలను అర్థం చేసుకోవడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ పిల్లలను ఆ పాఠశాలలకు ఒక్కరోజైనా పంపాలని మంగళవారం మహారాష్ట్రలోని హింగోలిలో ప్రభుత్వ పాఠశాల పరిస్థితిపై జరిగిన నిరసన సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
మారుమూల ప్రాంతాల్లోని పిల్లలకు కనీస రవాణా సైకర్యాలు కల్పించడంలో మహారాష్ట్ర ప్రభుత్వం విఫలమైందనిదీప్కే ఆరో పించారు. ఎన్నికల ర్యాలీల కోసం బస్సులు, రైళ్లను ఏర్పాటు చేయగలిగే నేతలు విద్యార్థలు కోసం కనీసం ఒక్క బస్సును కూడా సమకూర్చడం లేదని విమర్శించారు.