Deepfakes: డీప్‌ఫేక్ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం.. నియంత్రణకు త్వరలో కొత్త మార్గదర్శకాలు: కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
Deepfakes : డీప్‌ఫేక్ ఇప్పుడు పెను సమస్యగా తయారైంది. ఆ వీడియోలు, ఇమేజ్‌లతో సెలబ్రిటీలను టార్గెట్ చేస్తున్నారు. డీప్‌ఫేక్ సమస్య గురించి సోషల్ మీడియా సంస్థలతో ఇవాళ కేంద్ర మంత్రి వైష్ణవ్ సమావేశం నిర్వహించారు. డీప్‌ఫేక్ నియంత్రణ కోసం త్వరలో మార్గదర్శకాలను రిలీజ్ చేయనున్నట్లు చెప్పారు.
న్యూఢిల్లీ: డీప్‌ఫేక్(Deepfakes) సమాజానికి ప్రమాదకరంగా తయారైనట్లు కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ఇవాళ వివిధ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లతో ఆయన చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో కొత్త నియంత్రణ మార్గదర్శకాలను వీలైనంత త్వరగా రూపొందించనున్నట్లు మంత్రి వెల్లడించారు. కొన్ని వారాల్లోనే ఆ మార్గదర్శకాలకు చెందిన ముసాయిదాను అందుబాటులోకి వస్తుందన్నారు. మీడియా సమావేశంలో మంత్రి వైష్ణవ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి డీప్‌ఫేక్‌లు తీవ్ర ప్రమాదకరంగా మారినట్లు వెల్లడించారు. రష్మిక మందానా, కాజోల్, ప్రధాని మోదీకి చెందిన డీప్‌ఫేక్ వీడియోలు, ఇమేజ్‌లు ఇటీవల దుమారం రేపిన విషయం తెలిసిందే.
సోషల్ మీడియా, ఏఐ కంపెనీలతో నిర్వహించిన మీటింగ్‌లో నాలుగు అంశాలను చర్చించినట్లు మంత్రి తెలిపారు. డీప్‌ఫేక్‌లను గుర్తించడం, పోస్టింగ్ చేయకుండా నియంత్రించడం, వైరల్ కాకుండా చూడడం, రిపోర్టింగ్ వైఖరి గురించి పలు కంపెనీలతో చర్చించినట్లు మంత్రి తెలిపారు. డీప్‌ఫేక్‌ల గురించి ప్రజల్లో చైతన్యం కలిగించే అంశం గురించి కార్యక్రమాలను నిర్వహించాలని మంత్రి చెప్పారు. ప్రభుత్వం, పరిశ్రమలు, మీడియా కలిసి పనిచేయాలన్నారు.
#WATCH | Delhi: On Deep fake, Union Minister for Communications, Electronics & IT Ashwini Vaishnaw says, “Deep fake has emerged as a new threat in the society. We need to take immediate steps. Today a meeting was held with social media platforms. We’ve to focus on four… pic.twitter.com/oFdgdxXywo
— ANI (@ANI) November 23, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

