PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) విదేశీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రస్తుతం ప్రధాని సైప్రస్ (Cyprus)లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మోదీకి అరుదైన గౌరవం లభించింది. ఆ దేశ అత్యున్నత పురస్కారంతో మోదీని అకడి ప్రభుత్వం సత్కరించింది. సైప్రస్ అత్యున్నత పురస్కారం ‘ది గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్’ని ప్రధాని అందుకున్నారు. ఈ అవార్డుతో తనను సత్కరించినందుకు సైప్రస్ ప్రభుత్వానికి ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డును ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహానికి అంకితం చేస్తున్నట్లు ప్రధాని ఈ సందర్భంగా ప్రకటించారు.
ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలైడ్స్ (Nikos Christodoulides) ఆహ్వానం మేరకు ప్రధాని సైప్రస్ వెళ్లారు. జూన్ 15, 16 తేదీల్లో ప్రధాని అక్కడ పర్యటించనున్నారు. కాగా గడిచిన రెండు దశాబ్దాల్లో భారత ప్రధాని సైప్రస్ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ పర్యటనలో ప్రధాని మోదీ.. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలైడ్స్‌తో భేటీ అయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. సైప్రస్ పర్యటన అనంతరం ప్రధాని కెనడాలో జరుగుతున్న జీ7 సదస్సుకు హాజరుకానున్నారు. అనంతరం క్రొయేషియాలో కూడా పర్యటించనున్నారు.
Also Read..
Mohsen Rezaei | మాపై అణు బాంబులు వేస్తే ఇజ్రాయెల్‌పై పాక్ ప్రతిదాడి చేస్తుంది : ఇరాన్
US embassy | ఇరాన్ క్షిపణి దాడిలో దెబ్బతిన్న ఇజ్రాయెల్‌లోని యూఎస్ ఎంబసీ
Ayatollah Ali Khamenei | ఇజ్రాయెల్ దాడులు.. బంకర్లో తలదాచుకుంటున్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ..!