US embassy | పశ్చిమాసియా మళ్లీ భగ్గుమంది. ఇజ్రాయెల్, ఇరాన్ (Iran) మధ్య భీకర యుద్ధం మొదలైంది. క్షిపణులు, డ్రోన్లతో ఇరు దేశాలు దాడులు ప్రతిదాడులకు పాల్పడుతున్నాయి. ఇరాన్‌లోని అణు, సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది. దీంతో టెహ్రాన్ సైన్యానికి చెందిన అత్యున్నత అధికారులతోపాటు పదుల సంఖ్యలో అణు శాస్త్రవేత్తలు మృతిచెందారు.
ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ కూడా అదేరీతిలో ప్రతిస్పదిస్తున్నది. ఇజ్రాయెల్‌పై క్షిపణుల వర్షం కురిపిస్తున్నది. ఇరాన్ జరిపిన దాడుల్లో జెరూసలేంలోని అమెరికా రాయబార కార్యాలయం (US embassy ) స్వల్పంగా దెబ్బతిన్నది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణి (Iranian missile strikes) యూఎస్ ఎంబసీ సమీపంలో పడింది. దీంతో రాయబార కార్యాలయానికి స్వల్ప నష్టం వాటిల్లినట్లు ఇజ్రాయెల్‌లోని అమెరికా రాయబారి తెలిపారు. ఈ కారణంగా నేడు ఎంబసీని మూసివేస్తున్నట్లు వెల్లడించారు. అయితే, ఈ దాడిలో సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరగలేదని సదరు అధికారి తెలిపారు.
Our @usembassyjlm US Embassy in Israel & Consulate will officially remain closed today as shelter in place still in effect. Some minor damage from concussions of Iranian missile hits near Embassy Branch in @TelAviv but no injuries to US personnel.
— Ambassador Mike Huckabee (@GovMikeHuckabee) June 16, 2025
Also Read..
Ayatollah Ali Khamenei | ఇజ్రాయెల్ దాడులు.. బంకర్లో తలదాచుకుంటున్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ..!
Israel Iran War | ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం.. జెరూసలెంలో సైరన్ మోతలు
Benjamin Netanyahu | ట్రంప్‌ను చంపాలని చూస్తున్న టెహ్రాన్.. ఇజ్రాయెల్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు