ముంబై, డిసెంబర్ 29: దేశవ్యాప్తంగా ఏటీఎంల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయి. ఒక వైపు డిజిటలైజేషన్ పెరుగుతుండటంతో ఏటీఎంల నిర్వహణ ఖర్చులు అధికం కావడంతో వీటి సంఖ్యను బ్యాంకు లు తగ్గించుకుంటున్నాయి. రిజర్వు బ్యాంక్ తాజాగా విడుదల చేసిన నివేదిక కూడా ఇదే విషయాన్ని స్పష్టంచేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో శాఖలను పెంచుకున్న బ్యాంకులు..ఏటీఎంలను మాత్రం భారీగా తగ్గించుకున్నాయి. మార్చి 31,2025 నాటికి దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల ఏటీఎంలు 2,51,057కి తగ్గాయి. అంతక్రితం ఏడాది 2,53,417గా ఉన్నాయి. పలు ప్రభుత్వరంగ బ్యాంకులు విలీనం కావడంతో వీటి సంఖ్య తగ్గిపోయాయి. గ్రామీణ, సెబీ-అర్బన్, అర్బన్ ప్రాంతాల్లో ప్రభుత్వరంగ బ్యాంకులు అత్యధికంగా ఏటీఎంలను నిర్వహిస్తుండగా..ప్రైవేట్ బ్యాంకులు మాత్రం అర్బన్, మెట్రోపాలిటన్ సిటీల్లో మాత్రమే నెలకొల్పుతున్నాయి.