హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): మహిళ ఆత్మహత్య కేసులో ఆమె భర్త, అత్త, మామ, ఆడపడుచులకు కింది కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను హైకోర్టు రద్దుచేసింది. చేసుకోవడానికి ముందు ఆమె వేధింపులకు గురైనట్టు పోలీసులు ఆధారాలు చూపలేదని తెలిపింది. మెదక్ జిల్లా మునిపల్లికి చెందిన లక్ష్మి అనే మహిళ 2011లో రూ.2 లక్షల అదనపు కట్నం కోసం వేధింపులకు గురై ఆత్మహత్యకు పాల్పడిందని ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనిపై పోలీసులు నమోదు చేసిన చార్జిషీట్‌ను వికారాబాద్ కోర్టు విచారణ జరిపి.. లక్ష్మి భర్త, అత్త మామలు, ఆడపడుచులకు యావజ్జీవ శిక్ష విధిస్తూ 2016లో తీర్పు చెప్పింది. దీనిని తాజాగా హైకోర్టు రద్దు చేసింది.