Private Banks | న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఉద్యోగుల సంఖ్య తగ్గుదల 25 శాతానికి పెరిగిందని, ఈ సంఖ్య పెరగడం వల్ల బ్యాంకుల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆర్బీఐ తన తాజా నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది.
2023-24 సంవత్సరంలో కొన్ని ప్రైవేట్ రంగ బ్యాంకులు, చిన్న ఆర్థిక బ్యాంకులలో(ఎస్ఈబీ) ఉద్యోగుల క్షీణతా శాతం దాదాపు 25 వరకు ఉందని దేశంలో 2023-24లో బ్యాంకింగ్ వ్యవస్థ పరిణామాలు, ప్రగతిపై రూపొందించిన తాజా నివేదికలో ఆర్బీఐ పేర్కొంది.