కోర్బా: తాగునీరు, కరెంటు లాంటి కనీస సౌకర్యాలు కల్పించనందుకు అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని ఛత్తీస్‌గఢ్‌లోని రెండు గిరిజన గ్రామాలు నిర్ణయించాయి. బీజేపీ ఎమ్మెల్యే నన్కీ రామ్ కన్వర్ ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్‌పూర్ నియోజకవర్గంలోని కెరకచ్చర్ గ్రామపంచాయతీ పరిధిలోని సర్దిహ్, బాగ్దారిదంద్ గ్రామాల ప్రజలు ఈ మేరకు గ్రామ శివార్లలో బ్యానర్ ప్రదర్శించారు.
గ్రామస్థులకు కరపత్రాలు పంచారు. ‘వట్టి వాగ్దానాలతో రాజకీయ నాయకులు గెలవలేరు. మాకు మరో మార్గం లేక ఈసారి ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించాం’ అని కొందరు గ్రామస్థులు మీడియాకు తెలిపారు.