న్యూఢిల్లీ, జనవరి 2: ముంబై వరుస బాంబు పేలుళ్ల నిందితుడు, ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం చిన్ననాటి ఇంటితో పాటు అతడి కుటుంబానికి చెందిన మూడు వ్యవసాయ భూములను ఈ నెల 5న వేలం వేయనున్నారు. ఈ ఆస్తులన్నీ ముంబాకే గ్రామంలో ఉన్నాయి.
చట్ట ప్రకారం సీజ్ చేసిన ఈ ఆస్తుల మొత్తం విలువ రూ.19 లక్షలు. దావూద్ ఇబ్రహీంకు చెందినని కావడం వల్ల వీటిని అమ్మడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో వీటిని వేలం వేయాలని అధికారులు నిర్ణయించారు. వేలంలో పాల్గొనడానికి ఈ నెల 3లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.