Dalit woman : దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఒక దళిత మహిళను కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు.. బలవంతపు మత మార్పిడికి ప్రయ్నతించారు. ఈ ఘటనపై బాధితురాలు ఢిల్లీ పోలీసులకు ఈ నెల 14న ఫిర్యాదు చేసింది. దీనిపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది.
ఈ ఘటనపై వారం రోజుల్లోగా తగిన నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. పోలీసులకు బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని జామియా నగర్‌కు చెందిన 23 ఏళ్ల దళిత మహిళకు ఒక వ్యక్తి సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యాడు. అది కూడా ఫేక్ ఐడెంటిటీతో. అనంతరం అతడు పరిచయం పెంచుకుని, ఆమెకు దగ్గరయ్యాడు. అనంతరం అతడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 2021నుంచి 2025 వరకు ఇలా అత్యాచారం చేశాడు. అంతేకాదు.. అతడితోపాటు మరికొందరు కూడా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయంలో ఒక మహిళ కూడా సాయపడింది. అలాగే, ఆమెను కిడ్నాప్ చేసి బలవంతంగా మతం మార్చేందుకు ప్రయత్నించారు.
దీంతో బాధితురాలు తాజాగా ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆరుగురు నిందితుల్లో నలుగురిని అరెస్టు చేశారు. ఇందులో ఒక మహిళ కూడా ఉంది. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ రహత్కార్ స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించారు.