ఐఐటీ బాంబేలో విద్యార్థి ఆత్మహత్య.. హాస్టల్ బిల్డింగ్ ఏడో అంతుస్తు నుంచి దూకి సూసైడ్
IIT Bombay | మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఐఐటీ బాంబేలో విషాదం చోటు చేసుకుంది. బీటెక్ ఫస్టియర్ చదువుతున్న ఓ 18 ఏండ్ల విద్యార్థి క్యాంపస్ ఆవరణలో ఆదివారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నాడు.
ముంబై : మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఐఐటీ బాంబేలో విషాదం చోటు చేసుకుంది. బీటెక్ ఫస్టియర్ చదువుతున్న ఓ 18 ఏండ్ల విద్యార్థి క్యాంపస్ ఆవరణలో ఆదివారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనాస్థలిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. మృతుడిని అహ్మదాబాద్‌కు చెందిన దర్శన్ సోలంకిగా పోలీసులు గుర్తించారు. దర్శన్ శనివారమే తన మొదటి సెమిస్టర్ ఎగ్జామ్స్ పూర్తి చేశాడు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక క్యాంపస్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.
దర్శన్‌ది ఆత్మహత్య కాదు హత్యే..
దర్శన్ మృతిపై అంబేద్కర్ పెరియార్ ఫూలే స్టడీ సర్కిల్, ఐఐటీ బాంబే ఓ ట్వీట్ చేసింది. దళిత విద్యార్థి దర్శన్ మృతిపట్ల సంతాపం తెలుపుతున్నాము. మూడు నెలల క్రితమే దర్శన్ ఐఐటీ బాంబేలో చేరారు. దర్శన్‌ది ఆత్మహత్య కాదు.. హత్య అని ట్వీట్లో పేర్కొన్నారు. దళిత, బహుజన, ఆదివాసీ విద్యార్థులకు క్యాంపస్‌లో భద్రత లేకుండా పోయిందన్నారు. కులం పేరుతో దూషిస్తున్నారని, ఈ విషయంలో కొంత మంది లెక్చరర్లు, ఇతర సిబ్బంది కూడా వివక్షను ఎదుర్కొంటున్నారని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

