Cyclone Michaung | బాపట్ల వద్ద తీరం దాటిన మిజ్గాం తుఫాను.. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు..!
Cyclone Michaung | బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను మిజ్గాం తీరం దాటింది. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల సమీపంలో తుఫాను తీరం దాటిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తుఫాను తీరం దాటిన నేపథ్యంలో గంటకు 90 నుంచి వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.
Cyclone Michaung | బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను మిజ్గాం తీరం దాటింది. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల సమీపంలో తుఫాను తీరం దాటిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తుఫాను తీరం దాటిన నేపథ్యంలో గంటకు 90 నుంచి వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. రాగల రెండుగంటల్లో మిగ్జాం తుఫాను బలహీనపడుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది. అనంతరం ఆరుగంటల్లోగా వాయుగుండంగా తుఫాను బలహీనపడుతుందని తెలిపింది. తుఫాను తీరం దాటిన నేపథ్యంలో అప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇదిలా ఉండగా.. తుఫాను ప్రభావంతో తమిళనాడు, ఏపీలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల రోడ్లు నదుల్లా మారాయి. వర్సాలకు చిన్నారి సహా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. తుఫాను తీరం దాటిన సమయంలో రాబోయే 24 గంటల్లో పలుచోట్ల 20 సెంటీమీటర్ల వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. భారీ వర్షాల నేపథ్యంలో ఏపీలో 8వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. తిరుపతిలో వర్షాలకు గోడ కూలి నాలుగేళ్ల బాలుడు మృతి చెందగా.. తమిళనాడులో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈదురుగాలులతో కురుస్తున్న వర్షాలకు చెట్లు నేలకూలరగా.. విద్యుత్ స్తంభాలు తెగిపడ్డాయి. ఏపీలో 140కిపైగా రైళ్లు, 40 విమానాలు రద్దయ్యాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

