న్యూఢిల్లీ, జూలై 28: పొలానికి గట్టు ఎంత ముఖ్యమో, టెక్ రంగాలకు డాటా అంతే ముఖ్యం. అలాంటిది రూ.కోట్ల విలువైన కంపెనీల డాటా చోరీకి గురవుతున్నది. 2022లో సగటున ఒక్కో డాటా చౌర్యం ఘటనలో రూ.17.6 కోట్లు ఆవిరయ్యాయి. ప్రముఖ టెక్ సంస్థ ఐబీఐం అన్ని వివరాలతో ‘కాస్ట్ ఆఫ్ డాటాబ్రీచ్ రిపోర్ట్-2022’ను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. 2022లో ఇప్పటి వరకు 29,500 రికార్డ్స్ చోరీకి గురయ్యాయి. ఒక్కో రికార్డు విలువ రూ.6,100 వరకు ఉంటుంది. గత సంవత్సరంతో పోల్చితే డాటా చోరీ 6.6 శాతం పెరిగిందని నివేదిక తెలిపింది. చోరీకి గురైన రికార్డుల్లో పరిశ్రమ రంగంలో ఒక్కోదాని విలువ రూ.9,024, సేవల రంగంలో రూ.7,085, టెక్ రంగంలో రూ.6,900గా ఉన్నదని వెల్లడించింది.
వినియోగదారులే లక్ష్యంగా సైబర్ దాడులు
స్పైవేర్ తయారీ సంస్థను గుర్తించిన మైక్రోసాఫ్ట్
న్యూయార్క్, జూలై 28: విండోస్ ఆధారంగా సైబర్ దాడులకు పాల్పడే స్పైవేర్‌ను అమ్ముతున్న సంస్థను మైక్రోసాఫ్ట్ గుర్తించింది. అధికారికంగా డీఎస్ఐఆర్ఎఫ్, నాట్వీడ్ అనే కోడ్ పేరుతో ఉన్న డెవలపర్ సుబెరో అనే స్పైవేర్‌ను అభివృద్ధి చేసింది. ఈ స్పైవేర్ బ్రిటన్, ఆస్ట్రియా, పనామా దేశాల్లోని బ్యాంకులు, న్యాయ సంస్థలు, కన్సల్టెన్సీ కంపెనీలు, వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుపుతున్నది. ఈ కంపెనీని మైక్రోసాఫ్ట్‌కు చెందిన మైక్రోసాఫ్ట్ త్రెట్ ఇంటెలిజెన్స్ సెంటర్, మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ రెస్పాన్స్ సెంటర్ ఈ కంపెనీని గుర్తించాయి. కంప్యూటర్లు సైబర్ దాడుల బారిన పడకుండా ఉండేందుకు 2022 జూలై వరకు అందుబాటులో ఉన్న మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీలను అప్డేట్ చేసుకోవాలని మైక్రోసాఫ్ట్ సంస్థ వినియోగదారులకు సూచనలు చేసింది.
గ్రామాల్లో పెరిగిన ఇంటర్నెట్ వాడకం
దేశంలోని గ్రామాల్లో ఇంటర్నెట్ వినియోగదారులు గత ఏడాదితో పోల్చితే 18 శాతం పెరిగారు. పట్టణాల్లో కంటే గ్రామాల్లో ఇంటర్నెట్ వినియోగం ఎక్కువగా పెరుగుతున్నదని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. పట్టణాల్లో ఇంటర్నెట్ వాడేవారు 2021 కంటే 5 శాతమే పెరిగారని, ఇంటర్నెట్కు గ్రామీణ భారతంలో 35.1 కోట్ల మంది యూజర్లు ఉన్నట్టు వెల్లడించింది. రాష్ర్టాల వారీగా చూస్తే ఇంటర్నెట్ వాడకంలో గోవా తొలి స్థానంలో నిలవగా, బీహార్ చివరి స్థానంలో ఉన్నది.
క్రెడెన్షియల్స్ రూ. 21.6 కోట్లు
అనుకోకుండా డాటా/మొమరీకార్డు పోవటం రూ. 19 కోట్లు
పిషింగ్ రూ. 20.6 కోట్లు