మీరట్, జూలై 27: సీఎస్ఐఆర్-నెట్ పరీక్షలో అక్రమాలకు పాల్పడిన నలుగురు అభ్యర్థులతో పాటు వారికి సహకరించిన మరో ముగ్గురిని యూపీలోని మీరట్‌లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ అరెస్టు చేసింది. జూలై 25 నుంచి 27 వరకు ఆన్లైన్ పద్ధతిలో ఈ పరీక్ష జరిగింది.
మీరట్‌లోని సుభార్తి విశ్వవిద్యాలయంలోని పరీక్ష కేంద్రంలో ఐటీ మేనేజర్ అరుణ్ శర్మ, ల్యాబ్ అసిస్టెంట్ వినీత్ కుమార్.. హర్యానాకు చెందిన నలుగురు అభ్యర్థుల నుంచి డబ్బులు తీసుకొని పరీక్షలో అక్రమాలకు సహకరించారు.