బెంగళూరు, మే1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కర్ణాటకలో ‘పే సీఎం’ తర్వాత ఇప్పుడు ‘క్రై పీఎం’, ‘క్రై పీఎం పే సీఎం ’ హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్ అవుతున్నాయి. ప్రధాని మోదీని ఉద్దేశించి ట్విట్టర్లో నెటిజన్లు ఈ హ్యాష్‌ట్యాగ్‌తో మీమ్‌లు, వీడియోలు షేర్ చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు తనను 91 సార్లు పలు విధాలుగా దూషించారంటూ మోదీ శనివారం హుమ్నాబాద్ సభలో పేర్కొన్నారు.
దీన్ని ఆదివారం కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రస్తావిస్తూ ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో క్రై పీఎం పే సీఎం’ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ‘క్రై పీఎం లేకుండా పే సీఎం అసంపూర్ణం, బీజేపీ ఫ్లాప్ షో ఇప్పుడు పూర్తయింది’ అని ఓ యూజర్ వ్యాఖ్యానించారు.