గోవా, డిసెంబర్ 14: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందంపై గోవాలో దాడి జరిగింది. ఆఫ్‌షోర్ కేసినో నౌక సిబ్బంది వారిపై దాడి చేసినట్టు గోవా పోలీసులు శనివారం తెలిపారు. మనీ లాండరింగ్ కేసులో క్రూయిజ్ కేసినో ప్రైడ్‌పై గురువారం దాడి చేసిన ఈడీ అధికారులు ఒక గదిలో తనిఖీలు జరుపుతుండగా, నౌక సిబ్బంది ఆధారాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారని పోలీసులు వెల్లడించారు.
అంతే కాకుండా ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ పోలూరి చెన్నకేశవరావు, అతని బృందంపై దాడి చేశారని చెప్పారు. దీంతో కేసు నమోదు చేసిన గోవా పోలీసులు కేసినో డైరెక్టర్‌తో పాటు పలువురు సిబ్బందిపై కేసు నమోదు చేశారు.