Crowd loots mangoes | మామిడి పండ్ల వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Crowd loots mangoes | మామిడి పండ్లు రవాణా చేస్తున్న వాహనం బోల్తాపడింది. దీంతో అందులోని మామిడి పండ్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. స్థానికులు వాటిని ఎత్తుకెళ్లారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
పాట్నా: మామిడి పండ్లు రవాణా చేస్తున్న వాహనం బోల్తాపడింది. దీంతో అందులోని మామిడి పండ్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. స్థానికులు వాటిని ఎత్తుకెళ్లారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Crowd loots mangoes) బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 40 ఏళ్ల అజయ్ పాశ్వాన్ తన భార్య సంతారా దేవితో కలిసి పశ్చిమ బెంగాల్ నుంచి ముజఫర్‌పూర్‌కు మామిడి పండ్లను వాహనంలో తరలిస్తున్నాడు. జాతీయ రహదారి 27లో ఆ వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆ దంపతులు తీవ్రంగా గాయపడ్డారు.
కాగా, ఆ వాహనం వద్దకు చేరుకున్న జనం రోడ్డుపై పడిన మామిడి పండ్లను ఏరుకుని ఎత్తుకెళ్లారు. ప్రమాదంలో గాయపడిన అజయ్, అతడి భార్యను ఎవరూ పట్టించుకోలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న తర్వాతే వారిని ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు చికిత్స పొందుతూ అజయ్ మరణించాడు. అతడి భార్య సంతారా దేవికి చికిత్స కొనసాగుతున్నది. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే రోడ్డుపై పడిన మామిడి పండ్లను జనం ఎత్తుకెళ్లిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vigilance Raids | గద్వాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు
Harish Rao | నువ్వు మోటార్లు నడిపి ఉంటే వరంగల్‌కు కరువు ఎక్కడిది.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్‌లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

