Tejashwi Yadav : బీహార్ (Bihar) లో ప్రతిపక్ష మహా ఘట్బంధన్ (Maha Ghatbandhan) తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి (CM candidate) ని తానేనని ఆర్జేడీ నేత (RJD top leader) తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) ప్రకటించుకున్నారు. ఆరా జిల్లాలో ఓట్ అధికార్ యాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై కాంగ్రెస్ అగ్రనేత (Congress top leader) రాహుల్ గాంధీ (Rahul Gandhi), సమాజ్‌వాది పార్టీ చీఫ్ (SP Chief) అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) సమక్షంలో తేజస్వి ఈ ప్రకటన చేశారు.
అయితే రాహుల్‌గాంధీ మాత్రం తేజస్వి ప్రకటనపై మౌనంగా ఉండిపోయారు. ఆరా ర్యాలీలో తేజస్వీ యాదవ్ ఇంకా మాట్లాడుతూ.. తాను ప్రకటించిన సంక్షేమ కార్యక్రమాలనే సీఎం నితీశ్ కుమార్ అమలు చేస్తున్నారని ఆరోపించారు. ముందు తాను వెళ్తుంటే ప్రభుత్వం వెనుక వస్తోందని అన్నారు. మీకు కాపీ కొట్టే సీఎం కావాలా..? ఒరిజినల్ సీఎం కావాలా..? అని సమావేశానికి వచ్చిన ప్రజలను ప్రశ్నించారు.
మహాఘట్బంధన్ తరఫున సీఎం అభ్యర్థిని తానేనని తేజస్వి ప్రకటించారు. రాహుల్‌గాంధీ మాత్రం మౌనంగా ఉండిపోయారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయినప్పటికీ బీహార్‌లో ఆర్జేడీ పెద్దన్న అని వ్యాఖ్యానించారు. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ కంటే ఆర్జేడీదే పైచేయి అన్న అర్థంలో తేజస్వి మాట్లాడారు.