Crime news : తల్లి తలపై కొడుకు ఇనుపరాడ్డు (Iron rod) తో కొట్టి దారుణంగా చంపేశాడు. తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రం నెల్లై (Nellai) జిల్లాలోని నాంగునేరి మూలైకరైపట్టి పట్టణ సమీపంలో ఎడుప్పల్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తల్లి వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆగ్రహించి కుమారుడు ఆమెను కొట్టిచంపాడు. ఎడుప్పల్ (Eduppal) గ్రామానికి చెందిన పూల్పాండి, రెజీనా (43) ఇద్దరూ భార్యాభర్తలు.
వారికి కొంబయ్య (22), వినోద్ (13) అనే ఇద్దరు కుమారులున్నారు. వారిలో కొంబయ్య కూలీ పనిచేస్తున్నాడు. వినోద్ ఆ ప్రాంతంలోని ఒక పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. రెండేళ్ల క్రితం రెజానీ భర్త పూల్పాండి మృతిచెందాడు. అప్పటి నుంచి రెజీనా తన కుమారులతో కలిసి నివసిస్తోంది. ఈ క్రమంలో కొన్ని రోజులుగా రెజీనాకు, ఆమె కుమారుడు కొంబయ్యకు మధ్య గొడవలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో శుక్రవారం ఆ ప్రాంతంలో జరిగిన ఆలయ ఉత్సవాన్ని చూసి అర్ధరాత్రి ఇంటికి వచ్చిన కొంబయ్య తన తల్లితో గొడవపడ్డాడు. ఇనుపరాడ్‌తో రెజీనా తలపై కొట్టి హతమార్చి పారిపోయాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న మూలైకరైపట్టి పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని నెల్లై పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల విచారణలో రెజీనా అదే ప్రాంతానికి చెందిన యువకుడితో వివాహేతర బంధం పెట్టుకున్నట్లు వెల్లడైంది.
పోలీసులు వెల్లడించిన ప్రకారం.. తల్లి వివాహేతర బంధం గురించి కొంబయ్యకు తెలియడంతో ఆమెను మందలించాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఆలయ ఉత్సవం చూసి కొంబయ్య అర్ధరాత్రి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో తల్లి రెజీనా, ఓ యువకుడు ఏకాంతంగా ఉండటం చూశాడు. కొంబయ్యను చూసిన ఆ యువకుడు పారిపోయాడు. కొంబయ్య తల్లితో గొడవ పడి హత్య చేశాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.