e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, October 22, 2021
Home News తాలిబన్‌ టీమ్‌.. క్రికెట్‌ టోర్నీ నుంచి తొలగింపు

తాలిబన్‌ టీమ్‌.. క్రికెట్‌ టోర్నీ నుంచి తొలగింపు

జైపూర్‌: ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు తమ ఆధీనంలోకి తెచ్చుకున్న నాటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఆ పేరు మారుమోగిపోతున్నది. కాగా, తాలిబన్‌ పేరుతో ఉన్న ఒక క్రికెట్‌ టీమ్‌ను టోర్నీ నుంచి తొలగించడంతోపాటు నిషేధం విధించారు. రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. భనియానా గ్రామంలో ఇటీవల ఒక క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహించారు. అందులో ‘తాలిబన్‌ క్లబ్‌’ పేరుతో ఒక టీం పాల్గొన్నది.

కాగా, ఒక మ్యాచ్ ఆడిన తర్వాత ‘తాలిబన్‌’ క్రికెట్‌ టీమ్‌పై వివాదం మొదలైంది. ‘తాలిబన్‌’ పేరుతో క్రికెట్‌ టీం ఉండటంపై స్థానికులు అభ్యంతరం తెలిపారు. దీంతో ఆ టీమ్‌ను టోర్నీ నుంచి నిర్వాహకులు తొలగించారు. తాలిబన్‌ క్రికెట్‌ క్లబ్‌పై నిషేధం విధించినట్లు చెప్పారు. ఈసారి ఆన్‌లైన్‌లో నమోదు వల్ల ఈ పొరపాటు జరిగిందని, భవిష్యత్తులో ఇలా జరుగకుండా చర్యలు తీసుకుంటామంటూ క్రికెట్ టోర్నీ నిర్వాహకులు క్షమాపణలు చెప్పారు.

- Advertisement -

కాగా, ఈ క్రికెట్ టోర్నమెంట్‌ జరిగిన గ్రామం, అణు పరీక్షలు నిర్వహించిన, రొటీన్‌గా సైనిక విన్యాసాలు నిర్వహించే కీలకమైన పోఖ్రాన్‌కు 36 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. దీంతో క్రికెట్‌ టోర్నీలో తాలిబన్‌ పేరున్న టీం పాల్గొనడం వివాదాస్పదమైంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement