న్యూఢిల్లీ: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury) ఆరోగ్యం మరింత విషమించింది. ఆయన ఆరోగ్యం ఆందోళకరంగా ఉందని పార్టీ వర్గాలు వెళ్లడించాయి. గత రెండు రోజుల్లో మరింత దిగజారిందని తెలిపారు. శ్వాసకోశ సంబంధిత, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గత నెల 19 నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్సం పొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వెంటిలేటర్‌పై వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పార్టీ కేంద్ర కమిటీ రెండు రోజుల క్రితం వెల్లడించిన విషయం తెలిసిందే. డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి, డాక్టర్ గౌరి నేతృత్వంలో వివిధ విభాగాలకు చెందిన వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నదని తెలిపింది. ఇన్ఫెక్షన్ తొలగించేందుకు ఉపయోగించిన మందులు పనిచేయకపోవడంతో జపాన్ నుంచి ప్రత్యేక మందులు తెప్పిస్తున్నారని సమాచారం.