న్యూఢిల్లీ, మార్చి 14: ప్రతిపక్ష నాయకులను వేధించేందుకు కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీని ప్రయోగిస్తున్నదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. గత తొమ్మిదేండ్లలో సీబీఐ, ఈడీ విచారణ జరిపిన కేసుల్లో ఎంతమందికి శిక్షలు పడ్డాయో వెల్లడించాలని ఆయన సవాల్ చేశారు. ఢిల్లీలో మంగళవారం జరిగిన లోక్మత్ సదస్సులో ఏచూరి మాట్లాడారు. దర్యాప్తు సంస్థలు జరిపే విచారణకు తాము వ్యతిరేకం కాదని, కానీ గత తొమ్మిదేండ్లలో ఈడీ చేపట్టిన కేసుల్లో ఒక్కటైనా నేరనిరూపణ జరిగిందా? అని ప్రశ్నించారు.
చట్టాన్ని ఉల్లంఘించిన వారినే పట్టుకుంటున్నామని అంటున్నారని, అలాంటప్పుడు శిక్షలు ఎందుకు పడటం లేదని నిలదీశారు. దీనినిబట్టి.. కేవలం ప్రతిపక్ష నేతలను వేధించేందుకే ఈడీ, సీబీఐని ప్రయోగిస్తున్నారన్న సంగతి వెల్లడవుతున్నదని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతల ఐక్యతను దెబ్బతీయడమే బీజేపీ ఎజెండా అని దుయ్యబట్టారు. ‘కొంతమందిపై కేసులు పెట్టి దర్యాప్తు ప్రారంభించారు.