చెన్నై, జూలై 12: ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలు వల్ల దేశంలో శాంతి, సామరస్యానికి విఘాతం కలుగుతుందని డీఏంకే తెలిపింది. రాజ్యాంగం ద్వారా దళితులు, గిరిజనులు తదితర వర్గాలకు డా.బీఆర్ అంబేద్కర్ కల్పించిన హక్కులకు వ్యతిరేకంగా యూసీసీ ఉందని ఆ పార్టీ పేర్కొంది. ఈ మేరకు యూసీసీకి వ్యతిరేకంగా ఆ పార్టీ లా కమిషన్కు బుధవారం నివేదికను సమర్పించింది.
యూసీసీ అమలు నిలిపివేయాలని కేంద్రానికి సిఫారసు చేయాలని లా కమిషన్ను కోరింది. యూసీసీపై కాంగ్రెస్కు స్పష్టమైన విధానం లేదని సీపీఐ(ఎం) పార్టీ విమర్శించింది. వేర్వేరు రాష్ర్టాల్లో ఆ పార్టీ వేర్వేరు విధానాలను కలిగి ఉందని తెలిపింది. యూసీసీని అమలు చేసేందుకు బీజేపీ తహతహలాడుతున్నదని, కానీ దాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ ఇప్పటి వరకు ఎటువంటి కార్యాచరణ రూపొందించలేదని సీపీఐ(ఎం) కేరళ రాష్ట్ర సెక్రెటరీ ఎంవీ గోవిందన్ విమర్శించారు.