Maha Kumbh | ప్రయాగ్రాజ్: త్రివేణి సంగమంలో జరుగుతున్న మహా కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలివచ్చి స్నానమాచరిస్తున్న నేపథ్యంలో అక్కడి నీటి స్వచ్ఛతపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. నీటి స్వచ్ఛతపై కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) అనుమానాలు వ్యక్తం చేసింది.
ఈ మేరకు నివేదిక విడుదల చేసింది. కానీ సీపీసీబీ నివేదిక అసంబద్ధమని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, అలహాబాద్ యూనివర్సిటీ, బిహార్ యూనివర్సిటీలోని కొందరు వాతావరణ శాస్త్రవేత్తలు కొట్టిపారేస్తున్నారు. సీపీసీబీ నివేదికలో నైట్రేట్, ఫాస్పేట్ స్థాయుల గురించి పేర్కొనలేదని తెలిపారు. భక్తులు ఎలాంటి ఆందోళన చెందకుండా స్నానం చేయవచ్చని వారు స్పష్టం చేశారు. సీపీసీబీ నివేదిక ప్రకారమే నీటిలోని ఆక్సిజన్ శాతం సరిపడా ఉందని పేర్కొన్నారు.