CP Radhakrishnan | న్యూఢిల్లీ : ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ పేరు ఖరారైంది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన ఉప రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ దాఖలుకు చివరి తేదీ ఈ నెల 21.
1957 మే 4వ తేదీన జన్మించిన సీపీ రాధాకృష్ణన్.. తమిళనాడులోని కోయంబత్తూరు లోక్‌సభ స్థానం నుంచి రెండు సార్లు బీజేపీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందించారు. 2016 నుంచి 2019 వరకు ఆలిండియా కాయర్ బోర్డు చైర్మన్‌గా పని చేశారు. 2023 ఫిబ్రవరి 18 నుంచి జార్ఖండ్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. గతంలో తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గానూ ఆయన అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు.