న్యూఢిల్లీ : ‘ఆపరేషన్ సిందూర్’కు రుజువులు కావాలనేవారిని భారత వాయు సేన విమానానికి వేలాడదీసి, పాకిస్థాన్‌కు పంపించాలని రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్ బీజేపీ ఎంపీ సీపీ జోషీ అన్నారు. ఆయన శనివారం ఉదయ్‌పూర్ జిల్లా పరిషత్ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
“కొందరు పాకిస్థానీ భాష మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ చాలా ప్రశ్నలు లేవనెత్తారు. ఇప్పుడు యావత్తు ప్రపంచం ‘ఆపరేషన్ సిందూర్’ వీడియోలను చూసింది” అన్నారు.