న్యూఢిల్లీ: ఫలానా విధంగా చట్టాన్ని రూపొందించాలని చట్ట సభలను న్యాయస్థానాలు ఆదేశించజాలవని సుప్రీంకోర్టు శుక్రవారం చెప్పింది. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత పార్లమెంటు నూతన శాసనాన్ని తీసుకొస్తుందని తెలిపింది. శాసనాన్ని ఫలానా విధంగా రూపొందించాలని చట్ట సభను సుప్రీంకోర్టు లేదా హైకోర్టులు తమకు గల రిట్ అధికార పరిధిని వినియోగించి ఆదేశించజాలవని స్పష్టం చేసింది.
ఈ అంశంపై దాఖలైన పిల్‌ను 2024 ఫిబ్రవరిలో ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన అప్పీలుపై సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. దీనిపై విచారణ జరిపేందుకు నిరాకరించింది.