రాజ్యాంగ అన్వయానికి కోర్టులను అనుమతించాలి
రాజ్యాంగాన్ని అన్వయించడానికి న్యాయ వ్యవస్థను అనుమతించాలని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ హిమ కోహ్లి అన్నారు.
న్యూఢిల్లీ, మార్చి 5: రాజ్యాంగాన్ని అన్వయించడానికి న్యాయ వ్యవస్థను అనుమతించాలని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ హిమ కోహ్లి అన్నారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రత కేవలం న్యాయ సూత్రం మాత్రమే కాదని, చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి అది మూల స్తంభమని పేర్కొన్నారు. ‘స్వతంత్ర న్యాయ వ్యవస్థ-చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి కీలకం’ అంశంపై శనివారం కోల్‌కతాలో జరిగిన సదస్సులో ఆమె ప్రసంగించారు. ప్రజాస్వామ్య విలువలను పెంపొందించడంలో న్యాయ వ్యవస్థ రక్షణ గోడగా పని చేస్తుందని ఆమె అన్నారు. రాజ్యాంగం తమకు నిర్దేశించిన విధులను నిర్వర్తించడానికి భారత న్యాయ వ్యవస్థ అంకిత భావంతో స్వతంత్రంగా పని చేస్తున్నదని చెప్పారు. న్యాయ వ్యవస్థ పర్యవేక్షణ పాత్ర పోషించకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థలు, సంస్థలు అవినీతి మయం అవుతాయని, అధికార దుర్వినియోగం జరుగుతుందని, ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకం తగ్గిపోతుందని జస్టిస్ హిమ కోహ్లి పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

