Twisha Sharma | త్విషా శర్మ మృతి కేసు.. భర్త సమర్ధ్ శర్మకు ముందస్తు బెయిల్ నిరాకరణ
Twisha Sharma : నోయిడాకు చెందిన త్విషా శర్మ మృతి కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. త్విష శర్మ భర్త సమర్ధ్ సింగ్ దాఖలు చేసిన ముందుస్తు బెయిల్ పిటిషన్‌ను భోపాల్ కోర్ట్ సోమవారం నిరాకరించింది.
Twisha Sharma : నోయిడాకు చెందిన త్విషా శర్మ మృతి కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. త్విష శర్మ భర్త సమర్ధ్ సింగ్ దాఖలు చేసిన ముందుస్తు బెయిల్ పిటిషన్‌ను భోపాల్ కోర్ట్ సోమవారం నిరాకరించింది. కేసు విచారణ నిష్పక్షపాతంగా, లోతుగా జరగాలని మృతురాలి కుటుంబ సభ్యులు కోరిన నేపథ్యంలో నిందితుడికి కోర్టు బెయిల్ నిరాకరించింది. ప్రస్తుతం ఆమె భర్త సమర్ధ్ శర్మ పరారీలో ఉన్నారు. పోలీసులు అతడిపై రూ.10,000 నజరానా ప్రకటించారు. పాస్‌పోర్టును కూడా రద్దు చేశారు.
ఈ నెల 12న రాత్రి త్విషా శర్మ అనుమానాస్పద స్థితిలో మరణించింది. దీంతో ఆమె మరణానికి భర్త, అతడి కుటుంబ సభ్యులే కారణమంటూ మృతురాలి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. త్విషా శర్మ వివాహం గత ఏడాది డిసెంబర్లో సమర్ధ్ సింగ్‌తో జరిగింది. త్విష మరణంపై దాఖలైన కేసు విచారణ భోపాల్ కోర్టులో జరిగింది. త్విష పెళ్లైన తర్వాత నుంచి ఆమెను తీవ్ర వేధింపులకు గురి చేశారని, కట్నం కోసం వేధించారని ఆమె కుటుంబసభ్యులు పేర్కొన్నారు. అయితే, మృతురాలి కుటుంబం చేసిన ఆరోపణల్ని సమర్ధ్ తరఫు లాయర్లు ఖండించారు. భర్త, అతడి కుటుంబం వేధింపులకు పాల్పడింది అనేందుకు తగిన ఆధారాలు లేవన్నారు.
ఆమె మానసిక సమస్యల్తో బాధపడుతోందని, ఆమె వాడుతున్న మందులను పరిశీలించాలని సమర్ధ్ లాయర్లు కోరారు. అంతేకాదు.. త్విష అత్తవారింట్లో వేధింపులకు గురైతే.. పుట్టింటికి వెళ్లిన ప్రతిసారీ ఆమె తిరిగి అత్తారింటికి ఎందుకు తిరిగిస్తుందని లాయర్లు ప్రశ్నించారు. అయితే, కేసు విచారణ లోతుగా జరగాలి కాబట్టి, సమర్ధ్‌కు బెయిల్ ఇవ్వకూడదని త్విష తరఫు లాయర్లు కోరారు. దీంతో అతడి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. త్విష, సమర్ద్.. 2024లో ఒక డేటింగ్ యాప్ ద్వారా పరిచయమయ్యారు. అనంతరం ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడి కొంతకాలానికి పెళ్లి చేసుకున్నారు. ప్రధాన నిందితుడు సింగ్ తల్లి.. ఒక రిటైర్డ్ జడ్జి కావడం గమనార్హం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
Anurag Thakur: ఆరోపణలు చేస్తాడు.. కోర్టులో క్షమాపణలు చెప్తాడు.. ఇదీ రాహుల్ గాంధీ ట్రాక్ రికార్డు
Jobs DRDO | హైదరాబాద్ డీఆర్డీవోలో 195 అప్రెంటిస్ ఖాళీలు.. నవంబర్ 1 చివరితేదీ
Bhagat Singh Photo On Voter List | ఓటర్ల జాబితాలో భగత్ సింగ్ ఫొటో.. విమర్శలపై ఎన్నికల అధికారుల వివరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

