మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 09:55:24

పాకిస్తాన్‌ కాల్పుల్లో.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

పాకిస్తాన్‌ కాల్పుల్లో.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

జమ్మూ : జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి పాకిస్తాన్ దళాలు ఫార్వర్డ్ ఏరియాలు, పౌర ప్రదేశాల్లోకి మోర్టార్‌ షెల్స్‌ ప్రయోగించడంతో శుక్రవారం రాత్రి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. దీంతో వారికి సరైన సమాధానం చెప్పాలని భారత సైన్యానికి ఆదేశిలిచ్చినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి పాకిస్తాన్‌ కాల్పులు జరిపి, పూంచ్‌ జిల్లాలోని గుల్పూర్‌ సెక్టార్లో నియంత్ర రేఖ వెంట మోర్టార్‌ షెల్స్‌ ప్రయోగించి కాల్పుల విరమణ  ఉల్లంఘనకు పాల్పడిందని రక్షణ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఖారీ కర్మారా సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంట పాకిస్తాన్ సైన్యం భారీగా గ్రామాల్లోకి మోర్టార్‌ షెల్స్‌ ప్రయోగించడంతో కర్మారా గ్రామంలోని ఒక ఇంటిపై షెల్ పడింది. దీంతో ఆ ఇంటిలోని మొహద్ రఫీక్ (58), అతని భార్య రఫియా బీ (50), కుమారుడు ఇర్ఫాన్ (15) అక్కడికక్కడే మరణించారు. అలాగే కొన్ని ఇండ్లు దెబ్బతిన్నాయని, మరికొంత మంది గాయపడ్డారని అధికారులు పేర్కొన్నారు. ‘భారత సైన్యం తగిన విధంగా ప్రతీకారం తీర్చుకుంటోంది’ అని అధికారులు పేర్కొన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo