న్యూఢిల్లీ : ఇంటర్నెట్లో ఆకట్టుకునే కంటెంట్, వీడియోలకు కొదవ ఉండదు. ఎన్నో స్ఫూర్తిదాయక వీడియోలు, ఆలోచన రేకెత్తించే పోస్టులు సోషల్ మీడియాలో కనిపిస్తుండగా మరికొన్ని వీడియోలు (Viral video) ప్రేమతో హృదయాన్ని హత్తుకుంటాయి. అలాంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
క్రాంతి మూవీ నుంచి లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఆలపించిన జిందగీ కీ న టూటె లడి సాంగ్‌కు వృద్ధ దంపుతులు తమదైన హావభావాలతో లిప్ సింక్ ఇవ్వడం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ ఏకంగా 20 లక్షల మంది వీక్షించారు.
ఈ వీడియోలో పెద్దాయన కూర్చుని ఉండగా ఆయన భార్య ఉత్సాహంగా ఈ సాంగ్‌కు లిప్‌సింక్ ఇవ్వడంతో పాటు భర్త చేత హుషారుగా చేతులు ఆడిస్తూ ఎంకరేజ్ చేయడం కనిపిస్తుంది. లతా మంగేష్కర్, నితిన్ ముఖేష్ ఆలపించిన ఈ సాంగ్‌కు వృద్ధ దంపతుల లిప్ సింక్ వీడియోను నందా చౌహాన్ ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు పెద్దసంఖ్యలో రియాక్టవుతూ వృద్ధ దంపతుల తీరును ప్రశంసించారు. కామెంట్స్ సెక్షన్లో ట్రూ లవ్ అంటూ రాసుకొచ్చారు.
Read More