ముంబై: బైక్‌పై వెళ్తున్న భార్యాభర్తలను వేగంగా వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. (Car Hits Bike) దీంతో ఆ జంట గాలిలోకి ఎగిరి తొలుత ఆ కారుపై పడ్డారు. కారు సడన్ బ్రేక్ వేయడంతో ముందున్న రోడ్డుపై పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆ దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్రలోని పూణె జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జూలై 18న భార్యాభర్తలు బైక్‌పై అహ్మద్‌నగర్-కల్యాణ్ హైవేపై వెళ్తున్నారు. పింప్రి పెంధార్ గ్రామం సమీపంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు వారి బైక్‌ను ఢీకొట్టింటి. దీంతో ఆ దంపతులు గాలిలోకి ఎగిరారు. ఆ తర్వాత కారు ముందు పడ్డారు.
కాగా, అదృష్టవశాత్తు ఆ భార్యాభర్తలు ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆ జంట ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
PUNE | मिळालेल्या माहितीनुसार, नगर-कल्याण महामार्गावर पिंपरी पेंढार येथे अपघाताची ही घटना घडली आहे. भरधाव कारने दुचाकीला जोरदार धडक दिली. रस्ता ओलांडत असताना पाठीमागून आलेल्या भरधाव कारने दुचाकीला धडक दिली. कारच्या धडकेनंतर दुचाकीवरील दोघेही फुलबॉलप्रमाणे हवेत १० फुटांपर्यंत उंच… pic.twitter.com/1mcshxHJaA
— ℝ𝕒𝕛 𝕄𝕒𝕛𝕚 (@Rajmajiofficial) July 20, 2024