న్యూఢిల్లీ: మోదీ తన కోసం ఏమీ నిర్మించుకోలేదన్న విషయం ఈ దేశ ప్రజలకు తెలుసు అని, కానీ పేద ప్రజల కోసం మాత్రం నాలుగు కోట్ల ఇళ్లు నిర్మించినట్లు ప్రధాని(PM Modi) తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. నేను కూడా అద్దాల మేడ కట్టుకునేవాడిని అంటూ ఆమ్ ఆద్మీ పార్టీని ఆయన విమర్శించారు. ఇటీవల నిర్మించిన ఢిల్లీ సీఎం నివాసం కోసం భారీ మొత్తంలో ఖరీదైన వస్తువులను వాడారు. దానిపై ఆరోపణలు వస్తున్నాయి. పబ్లిక్ వర్క్స్ శాఖ రిలీజ్ చేసిన ఇన్వెంటరీలో విస్తుపోయే లెక్కలు ఉన్నాయి. సీఎం బంగ్లా కోసం చాలా హైఎండ్ ఎలక్ట్రానిక్ వస్తువుల్ని వాడినట్లు ఉన్నది. దీంతో బీజేపీ, ఆమ్ ఆద్మీ మధ్య రాజకీయ వేడి చెలరేగింది.
గత పదేళ్ల నుంచి ఢిల్లీని ఆపద చుట్టేసిందని, అన్నాహజారేను ముందు పెట్టి, కొందరు నిజాయితీలేని వాళ్లు ఢిల్లీని ఆపదలోకి నెట్టేశారని, ఆప్ పార్టీ.. ఢిల్లీపై ఆపదలా పడి, మొత్తం దోచేసుకుంటోందని ప్రధాని విమర్శించారు. రాజకీయ, ఆర్థిక స్థిరత్వానికి ఇండియా సింబల్‌గా మారిందన్నారు. 2025లో భారత పాత్ర మరింత బలపడిందన్నారు. ఈ ఏడాది ప్రపంచ పట్టికలో ఇండియాను మరింత ఉన్నత స్థానంలో నిలపాలన్నారు. ఇండియాను అతిపెద్ద ఉత్పత్తి దేశంగా మార్చాలన్నారు. ఢిల్లీ అభివృద్ధికి ఇది చాలా ముఖ్యమైన రోజు అని ప్రధాని మోదీ తన ట్వీట్లో వెల్లడించారు.
జుగ్గి-జోప్రి అర్బన్ రీడెవలప్మెంట్ ప్రాజెక్టుకు చెందిన 1675 ఫ్లాట్లను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. అశోక్ విహార్ ఏరియాలోని స్వాభిమాన్ అపార్ట్మెంట్లో నిర్మించిన ఈబ్ల్యూఎస్ ఫ్లాట్లకు చెందిన లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేశారు.
#WATCH | Delhi | Addressing a public meeting in Ashok Vihar’s Ramlila Ground, PM Narendra Modi says, “…Every people of Delhi can see the situation of Yamuna. Look at their (AAP) shamelessness, what kind of ‘aapda is this, they say that cleaning Yamuna won’t get them votes -… pic.twitter.com/hzxA4nOrvy
— ANI (@ANI) January 3, 2025