BJP Ruling States | స్పెషల్ టాస్క్ బ్యూరో హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): గురివింద తన కింద నలుపు ఎరగదన్న చందంగా ప్రధాని మోదీ హైదరాబాద్‌లో శనివారం తెలంగాణ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేశారు. బీజేపీ పాలిత రాష్ర్టాలు అవినీతిలో పీకలలోతు కూరుకుపోయిన విషయాన్ని మరిచి చేసిన వ్యాఖ్యలు ‘ఉల్టా చోర్ కోత్వాల్ కో డాటే’ (దొంగే, దొంగా…దొంగా అని అరిచినట్టు) అని అరచినట్టు ఉన్నదని విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ పాలిత రాష్ర్టాల్లోని అవినీతి ప్రతినిత్యం ఏదో ఒకటి వెలుగు చూస్తునే ఉన్నది. ఇక పొరుగున ఉన్న కర్ణాటకలో బీజేపీ సర్కారు గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు. ఆ రాష్ర్టానికి ‘కమిషన్రాజ్’ అనే బిరుదూ వచ్చింది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ తదితర రాష్ర్టాలలో వేలాది కోట్ల అవినీతి కుంభకోణాలు పలు సందర్భాల్లో బయటపడ్డాయి.
☞ దావణగెరె జిల్లా చెన్నగిరి బీజేపీ ఎమ్మెల్యే విరూపాక్షప్ప కుమారుడి ఇంట్లో లోకాయుక్తకు 8.6 కోట్ల అవినీతి సొమ్ము దొరికింది.
☞ కమిషన్ రాజ్ వ్యవస్థ పెచ్చరిల్లిపోయిందని, అవినీతికి పాల్పడే అధికారులను, రాజకీయ నాయకులను పక్కన పెట్టాలని మోదీ కి ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మోహన్‌దాసు ఫిర్యాదు చేశారు.
☞ సందేశ్ అనే పోలీస్ అధికారి గుండెపోటు మృతి చెందారు. పోస్టింగ్ కోసం 80 లక్షలు చెల్లించటం వల్లనే గుండెపోటుతో మృతి చెందినట్టు స్వయానా మంత్రి నాగరాజు వ్యాఖ్యానించారు.
☞ పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్లో జరిగిన అవినీతిలో రాష్ట్ర అడిషినల్ డైరెక్టర్ జనరల్ అమృత్‌పాల్ అరెస్టు అయ్యారు.
☞ బిల్లుల మంజూరుకు మంత్రి ఈశ్వరప్ప 40 శాతం కమిషన్ డిమాండ్ చేస్తున్నారని కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య చేసుకోగా. మంత్రిపై కేసు నమోదైంది.
☞ కమిషన్ల కోసం అధికారుల వేధింపులను తాళలేకపోతున్నాను…తనకు కారణ్య మరణానికి అనుమతి ఇవ్వా’లని హూబ్లీకి చెందిన కాంట్రాక్టర్ అమర్ గోల్ రాష్ట్రపతికి లేఖ రాశారు.
☞ పంచాయతీ భవనం నిర్మించి 2 ఏండ్లు అవుతున్నా బిల్లు చెల్లించకపోవడంతో అప్పుల పాలై తలలెత్తుకొని తిరగలేకపోతున్నాను…కారణ్యమరణానికి అనుమతి ఇవ్వాలని బెంగళూర్‌కు చెందిన కాంట్రాక్టర్ మంజునాథ్ దరఖాస్తు చేసుకున్నారు.
☞ దావణగెరె ఇన్చార్జి మంత్రి జిల్లాకు వచ్చినప్పుడు అధికారులు లంచం ముట్టజెప్పిన ఆడియో రికార్డు బయటకి వచ్చింది.
☞ భారీ వర్షాల వల్ల బెంగళూరు నీట మునిగింది. 40 శాతం కమిషన్లు చెల్లించి నాసిరకం పనులు చేయటం వల్లనే విపత్తు సంభవించినట్టు ఆరోపణలున్నాయి.
☞స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో టీఎన్ ప్రసాద్ అనే కాం ట్రాక్టర్ 16 కోట్లు ఖర్చు చేసి పనులు పూ ర్తి చేశారు. సొంత ఇల్లు అమ్ముకొని అప్పుల పాలయ్యారు. అయినా ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవటంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు కర్ణాటక సివిల్ కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు బల్రాం ఆరోపించారు.
☞ పీఎంకిసాన్ సమ్మాన్ నిధిలో భారీగా నిధులు గోల్మాల్. రూ.442 కోట్లు అనర్హుల ఖాతాలకు వెళ్లినట్టు బహిర్గతమైంది
☞ 40% కమిషన్రాజ్గా సీఎం బొమ్మై ఫోటోతో పోస్టర్లు కూడా వెలిశాయి.
☞ మాజీ సీఎం కుటుంబంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరపాలని స్పెషల్ కోర్టును హైకోర్టు ఆదేశించింది.
☞ ఉపాధిహామీ పథకంలో నకిలీ జాబ్‌కార్డుల భారీ అవినీతి బహిర్గతమైంది.
☞ మోదీ అట్టహాసంగా 8 వేల కోట్లతో నిర్మించిన బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ హైవే ఐదు రోజులకే వర్షాలకు కొట్టుకుపోయింది.
☞ నాలుగు అంతస్థుల ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ పేకమేడలా కూలిపోయింది. ఇందులో భారీ అవినీతి జరిగినట్టు మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు.
☞ అసెంబ్లీలో భర్తీ చేసిన 250 మంది ఉద్యోగుల నియామకాల్లో అవినీతి జరిగిందని ఉత్తరాఖండ్ రాష్ట్ర శాసనసభ కార్యదర్శి ముఖేశ్‌తో సహా 250 మంది ఉద్యోగుల తొలగించారు.
☞ మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించింది.
☞ మణిపూర్ రాష్ట్రంలో పీఎం ఆదర్శ్ యోజన కింద నిధులు గల్లంతైనట్టు సమాచారహక్కు చట్టం ద్వారా వెలుగు చూసింది.
☞ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ఆధీనం లో ఉన్న మహిళా శిశు సంక్షేమశాఖ లో బోగస్ లబ్ధిదారుల పేర్లతో వం దల కోట్ల కుంభకోణం జరిగిందని ప్రభుత్వ ఆడిటర్ ఇచ్చిన 36 పేజీల నివేదిక ఉదంతాన్ని ఎన్డీటీవీ బయటపెట్టింది.
☞ ప్రధాన మంత్రి ప్రారంభించిన ఆవాస్ యోజన పథకంలో సత్నా జిల్లాలో 600 ఇండ్లు నిర్మించినట్టు రికార్డుల్లో పేర్కొని నిధులు స్వాహా చేసినట్టు ఎన్డీటీవీ బయట పెట్టింది.
☞ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద నకిలీ బిల్లులతో రూ.200 కోట్లు కొల్లగొట్టిన కుంభకోణం అధికారుల విచారణలో బయటపడింది.
☞ రాజధాని భోపాల్-రాయ్‌సేన్ రహదారిపై నిర్మించిన కలియాసోట్ బ్రిడ్జి ఏడాదిలోనే కుప్పకూలింది.