Corona vaccine: దేశంలో 18 కోట్ల మందికిపైగా టీకా
Corona vaccine| ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఈఏడాది జనవరి 16న ప్రారంభమైన టీకా పంపిణీ మరో మైళురాయిని అధిగమించింది. దేశంలో నిన్న 8 గంటల వరకు 18 కోట్ల మందికిపైగా మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.

న్యూఢిల్లీ: ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఈఏడాది జనవరి 16న ప్రారంభమైన టీకా పంపిణీ మరో మైళురాయిని అధిగమించింది. దేశంలో నిన్న 8 గంటల వరకు 18 కోట్ల మందికిపైగా మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. కేంద్ర కుటుంబ సంక్షేమ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం శుక్రవారం రాత్రి వరకు దేశవ్యాప్తంగా 18,04,29,261 మంది టీకా వేసుకున్నారు. ఇందులో 96,27,199 మంది ఆరోగ్య కార్యకర్తలు మొదటి డోసు తీసుకున్నారని, మరో 66,21,675 మంది రెండో డోసు వేయించుకున్నారని తెలిపింది. అదేవిధంగా ఫ్రంట్లైన్ వర్కర్లు 1,43,63,754 మంది మొదటి డోసు, 81,48,757 మంది రెండో డోసు తీసుకున్నారని, 18 నుంచి 44 ఏండ్ల వయస్సువారు.. 42,55,362 మొదటి డోసు తీసుకోగా, 5,67,99,389 మంది 45 నుంచి 60 ఏండ్లు పైబడినవారు మొదటి డోసు, 87,50,224 రెండో డోసు తీసుకున్నారని తెలిపింది. ఇక 5,43,15,317 మంది 60 ఏండ్లు పైబడినవారు మొదటి డోసు, 1,75,47,584 మంది రెండో డోసు వేయించుకున్నారని వెల్లడించింది.
ఇక 119వ రోజైన శుక్రవారం.. 10,79,759 మందికి టీకా పంపిణీ చేశామని పేర్కొంది. ఇందులో 6,16,781 మంది తొలి డోసు, 4,62,978 మంది రెండో డోసు తీసుకున్నారని తెలిపింది. నిన్న ఒక్కరోజే 18 నుంచి 44 ఏండ్ల లోపువారు 3,25,071 మంది వ్యాక్సిన్ తీసుకున్నారని, దీంతో మొత్తం 42,55,362 మంది టీకా పొందారని వెల్లడించింది. కాగా, ఈరోజు ఉదయం వరకు వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య మరింత పెరగనుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
కరోనా దెబ్బకు వాయిదా పడ్డ సినిమా లిస్ట్ ఇదే..!
బైడెన్ సీనియర్ సలహాదారుగా నీరా టాండన్
బెర్హంపూర్ సర్కిల్ జైలులో 48 మంది ఖైదీలకు కరోనా
రాకెట్ దాడులు.. ఇజ్రాయెల్ నుంచి భారత్ చేరిన కేరళ మహిళ మృతదేహం
Good News : 2డీజీ డ్రగ్ వచ్చే వారం అందుబాటులోకి
భారత్కు సాయం ప్రకటించిన న్యూయార్క్ సిటీ
ముంచుకొస్తున్న తుఫాను
అలుపెరుగని అంగన్వాడీలు
కరోనా.. గందరగోళం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

