సోమవారం 13 జూలై 2020
National - Apr 13, 2020 , 21:40:23

క‌రోనా టెస్ట్‌లు అంద‌రికి ఉచితంగా కాదు: సుప్రీం కోర్టు

 క‌రోనా టెస్ట్‌లు అంద‌రికి ఉచితంగా కాదు: సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశమంతా హైఅలర్ట్ అయ్యింది. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే చాలు.. ప్రభుత్వమే దగ్గరుండి మరీ పరీక్షలు చేయించి, చికిత్స అందిస్తోంది. అయితే దేశంలో ఏర్ప‌డ్డ ప్ర‌త్యేక ప‌రిస్థితుల దృష్ట్యా అందరికి ప్ర‌భుత్వం ఉచితంగా క‌రోనా టెస్టులు నిర్వ‌హించాల‌ని గ‌తంలో ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు మార్పులు చేసింది. ప్ర‌ధాన‌మంత్రి ఉజ్వ‌ల్ యోజ‌న కింద అర్హ‌త గ‌ల పేద‌వారికి క‌రోనా టెస్టులు ఉచితంగా అందించాల‌ని తెలిపింది. మిగిలిన వారికి ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన ధ‌ర‌ల‌కు క‌రోనా టెస్టులు చేయాల‌ని తాజాగా తీర్పునిచ్చింది.


logo