ఆదివారం 12 జూలై 2020
National - Jun 16, 2020 , 14:51:42

జూలై 15లోగా దేశంలో 8 ల‌క్ష‌లకు క‌రోనా కేసులు!

జూలై 15లోగా దేశంలో 8 ల‌క్ష‌లకు క‌రోనా కేసులు!

న్యూఢిల్లీ: దేశంలో‌ ఇప్ప‌టికే  కరోనా మ‌హ‌మ్మారి విల‌య‌తాండ‌వం చేస్తున్న‌ది. రోజురోజుకు క‌రోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న‌ది. స‌గ‌టున రోజుకు పదివేలకు పైగానే కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో దేశంలో క‌రోనా బాధితుల సంఖ్య‌ ఇప్పటికే మూడు ల‌క్ష‌ల న‌ల‌భై నాలుగు వేల‌కు చేరింది. మ‌ర‌ణాలు కూడా దాదాపుగా ప‌ది వేల‌కు చేరుకున్నాయి. మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడు, ఢిల్లీల్లో ప‌రిస్థితి మ‌రింత దారుణంగా ఉన్న‌ది. 

ఈ నేప‌థ్యంలో అమెరికాలోని మిచిగాన్ యూనివ‌ర్సిటీ నిర్వ‌హించిన ఓ అధ్య‌య‌నానికి సంబంధించిన నివేదిక దేశ ప్ర‌జ‌ల్లో క‌ల‌క‌లం రేపుతున్న‌ది. జూలై 15లోగా భార‌త్‌లో క‌రోనా కేసుల సంఖ్య ఎనిమిది లక్షలకు చేరుకుంటుందని ఆ అధ్య‌య‌నంలో స్పష్టమైంది. భారత్‌లో తొలి కరోనా కేసు జనవరి 30న నమోదైంది. జూన్ 15 వరకు మొత్తం కేసుల సంఖ్య 3,43,091కి చేరింది. అంటే 138 రోజుల్లో కరోనా కేసుల సంఖ్య దాదాపు మూడున్నర లక్షలకు చేరుకుంది. ఈ నేప‌థ్యంలో జూలై 15లోగా కేసుల సంఖ్య  ఎనిమిది లక్షలకు చేరుకుంటుందని మిచిగాన్ యూనివర్శిటీ అధ్య‌య‌నం వెల్ల‌డించింది. 


logo