ముంబై: ఒక ఎమ్మెల్యే కారును ఆయన సెక్యూరిటీకి చెందిన పోలీస్ అధికారి కడిగారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్న ఆ ఎమ్మెల్యేపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే దీనిపై ఆయన వివరణ ఇచ్చారు. (Cop Washing MLA Car) మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ కారును ఒక పోలీసు అధికారి శుభ్రం చేశారు. నీటితో ఆ కారును కడిగారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ సప్కల్ ఈ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
పోలీస్ సిబ్బందిని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ఈ సంఘటన దీనికి ఉదాహరణ అని అన్నారు. ఇది ఎంతో అవమానకరమని మండిపడ్డారు.
మరోవైపు వైరల్ అయిన వీడియో క్లిప్‌పై శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ స్పందించారు. దీనిపై వివరణ ఇచ్చారు. భద్రతా విధుల్లో ఉన్న ఒక పోలీస్ అధికారి అల్పాహారం తిన్న తర్వాత ఆ కారులో వాంతి చేసుకున్నట్లు తెలిపారు. దీంతో ఆ పోలీస్ అధికారి స్వయంగా ముందుకు వచ్చి ఆ కారును క్లీన్ చేసినట్లు చెప్పారు. కారును కడమని ఎవరూ కూడా ఆ పోలీస్‌ను బలవంతం చేయలేదని అన్నారు.
కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా సంజయ్ గైక్వాడ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. 1987లో ఒక పులిని తాను చంపానని, ఆ పులి దంతాన్ని చైన్‌గా ధరిస్తున్నట్లు చెప్పారు. స్పందించిన అటవీ శాఖ అధికారులు ఆ ఎమ్మెల్యేపై దర్యాప్తు చేపట్టారు. ఆయన చైన్‌కు ఉన్న పులి దంతాన్ని ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపారు.
महाराष्ट्र पोलीस शर्म करो !
2दिवसांपूर्वी आमदारांनी असंवेदनशील वक्तव्य केले होते CM शाळेत पहारा देणार आहेत का ?
SP आरोपीच्या घरी बसणार आहेत का?
याचे उत्तर आज सकाळी मिळाले पोलीस आमदारांच्या गाड्या धुणार!
पोलीस यंत्रणेची चाटूगिरी सिद्ध.कुठे नेऊन ठेवला महाराष्ट्र माझा? pic.twitter.com/FnCXaXBaZp
— Harshwardhan Sapkal (@harshsapkal) August 29, 2024