రాంచీ: స్టీల్ ప్లాంట్‌లోని ఒక నిర్మాణం కూలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మరణించారు. పలువురు గాయపడ్డారు. శిథిలాల కింద కొందరు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. (Raipur steel plant tragedy) పోలీసులు, అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం సిల్తారా పారిశ్రామిక ప్రాంతంలోని గోదావరి ఇస్పాత్ లిమిటెడ్‌లో నిర్మాణంలో ఉన్న ఒక భాగం కూలింది. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో ఆరుగురు కార్మికులు మరణించారు. మరి కొందరు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, అధికారులు, అగ్నిమాపక సిబ్బంది ఆ స్టీల్ ప్లాంట్ వద్దకు చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద కొందరు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూలిన శిథిలాలను తొలగిస్తున్నారు.
Raipur: Part of the under-construction Godavari Plant collapsed in Siltara, injuring 6–7 people who were rushed to hospital. Families gathered outside as police reached the site.
CM Vishnu Deo Sai says, “I am deeply saddened by the incident…” #Chhattisgarh #Accident #Raipur pic.twitter.com/8rOPNabgl6— Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) September 26, 2025
Also Read:
juvenile stabs boy to death | బెయిల్‌పై బయటకు వచ్చిన బాల నేరస్తుడు.. కత్తితో పొడిచి బాలుడ్ని హత్య
cop dies of rabies | పోలీస్ అధికారిని రక్కిన కుక్క.. రేబిస్ సోకి మృతి
Jail For Cops | యువకుడి కస్టడీ డెత్‌పై కోర్టు సంచలన తీర్పు.. నలుగురు పోలీసులకు 11 ఏళ్లు జైలు శిక్ష