Srisailam | శ్రీశైలం దేవస్థానం నిర్వహిస్తున్న గో సంరక్షణ నిధి పథకానికి విజయవాడకు చెందిన పి.బాలసుబ్రమణ్య శ్రీనివాస్ అనే భక్తుడు రూ.1,00,116 విరాళంగా అందజేశారు. ఈ విరాళాన్ని దేవస్థాన పర్యవేక్షకులు కె.అయ్యన్నకు అందజేశారు. దేవస్థానం అధికారులు దాతకు స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు, స్వామి అమ్మవార్ల చిత్రపటాలు, తగు రశీదులు అందజేసి సత్కరించారు.