బెంగళూరు, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఓట్ల కోసం కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నడ్డా చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు కన్నడనాట విపక్షాలకు అస్ర్తాలుగా మారాయి. మోదీ చల్లని చూపులు రాష్ట్రంపై పడేందుకు బీజేపీ అభ్యర్థులకే ఓటేయాలని నడ్డా ఇచ్చిన పిలుపు ఆక్షేపణలకు గురైంది.
వరాలిచ్చేందుకు మోదీ ఏమైనా దేవుడా? అని విపక్షాలు విమర్శించాయి. ప్రధాని చేతిలో పెడితే తప్ప కర్ణాటక ప్రగతి పట్టాలపై దూసుకుపోదని అమిత్ షా అన్న మాటలకు విపక్షాలు స్పందిస్తూ.. ఆ మాత్రం అర్హతలు కన్నడిగులకు లేవా? అని అడిగాయి.