న్యూఢిల్లీ : ఇండిగో విమానాల రద్దుతో ఏర్పడిన సంక్షోభం నేపథ్యంలో పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల ఫిర్యాదులను రియల్-టైమ్‌లో పరిష్కరించేందుకు ఢిల్లీలో ఒక ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటుచేసింది.
విమాన ప్రయాణాల్లో తీవ్ర జాప్యం, ఫ్లైట్స్ రద్దు, విమానాశ్రయాలు, విమానయాన సంస్థల సేవలపై ఫిర్యాదులను స్వీకరించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటుచేసినట్టు పౌర విమానయాన శాఖ అధికారులు వెల్లడించారు. ప్రత్యేక పర్యవేక్షణ కేంద్రంగా దీనిని రూపొందించినట్టు చెప్పారు.
న్యూఢిల్లీ : జాతి వివక్ష దాడిలో త్రిపుర ఎంబీఏ విద్యార్థి మృతిచెందడం ఈశాన్య రాష్ర్టాల్ని కుదిపేస్తున్నది. మేం చైనీయులం కాదు.. ఇండియన్స్..అంటూ ఈశాన్య రాష్ర్టాల ప్రజలు దాడి ఘటనను ఖండిస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం ఉత్తరాఖండ్ డెహ్రాడూన్‌లో ఎంబీఏ విద్యార్థి ఏంజెల్ చక్మా, అతడి సోదరుడు మేఖేల్ చక్మాలపై కొంతమంది దాడికి తెగబడ్డారు. కత్తిపోట్లకు గురైన ఏంజెల్ (24) ఈ నెల 26న ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన త్రిపుర సహా పలు రాష్ట్రాల్లో ప్రజలను షాక్‌కు గురిచేసింది.