అయోధ్య : శ్రీరామ జన్మ భూమిలో రామాలయం నిర్మాణం పూర్తయింది. ప్రధాన దేవాలయ ప్రాంగణంతోపాటు గణేశ, శివ, హనుమాన్, సూర్యనారాయణ, భగవతి, అన్నపూర్ణ, శేషావతార దేవాలయాల నిర్మాణం కూడా పూర్తయింది. ఈ వివరాలను శ్రీరామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సోమవారం ఎక్స్ వేదికగా తెలిపింది. ధ్వజ స్తంభాలు, కలశాల స్థాపన కూడా జరిగినట్లు పేర్కొంది. ఇక్కడ నవంబరు 25న జరిగే ప్రత్యేక కార్యక్రమాల్లో ధ్వజారోహణ జరుగుతుందని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రామాలయంపై పతాకాన్ని ఆవిష్కరిస్తారని తెలిపింది.