Ahmedabad | ఇది గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్మించిన హత్కేశ్వర్ ఫ్లైఓవర్. ఆ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం రూ.44 కోట్లు వెచ్చించి దీనిని నిర్మించింది. 2017లో అట్టహాసంగా ప్రారంభించింది. వందేండ్ల వరకు ఫ్లైఓవర్ చెక్కు చెదరదని గొప్పగా ప్రకటించింది. తీరా చూస్తే ఐదేండ్లకే 2022లో ఫ్లైఓవర్ బీటలు వారింది. రాకపోకలు సైతం నిలిచిపోయాయి.
నాణ్యత లేని నిర్మాణంతో పిల్లర్లలో బలం తగ్గింది. మరమ్మత్తులు చేసినా ఫలితం లేదని, కూల్చడం తప్ప మరో మార్గం లేదని నిపుణులు తేల్చిచెప్పారు. దీంతో సర్కారు ఇప్పుడు ఫ్లైఓవర్‌ను కూల్చి, మళ్లీ కట్టాలని నిర్ణయించింది. ఇందుకు రూ.52 కోట్లు వృథా చేయనుంది.