పూరి జగన్నాథ ఆలయం వద్ద నిర్మాణాలు అవసరమే: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: పూరి జగన్నాథ ఆలయం వద్ద చేపడుతున్న నిర్మాణాలపై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఒడిశా ప్రభుత్వం చేపడుతున్నట్లు నిర్మాణ ప్రక్రియ ప్రజల ప్రయోజనార్థమే జరుగుతోందని సుప్రీం తెలిపింది. పూరి ఆలయం వద్ద నిర్మాణ పనులను నిలిపివేయాలని వేసిన పిటిషన్లను సుప్రీం కొట్టిపారేసింది. జస్టిస్ బీఆర్ గవాయి, హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. పూరి ఆలయానికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారని, వారికి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడం ప్రభుత్వ విధి అని, అలాంటప్పుడు ఆ నిర్మాణాన్ని ఆపేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించలేమని సుప్రీం ధర్మాసనం తెలిపింది.
అనవసరమైన పిల్స్‌ను దాఖలు చేయరాదు అని కోర్టు సీరియస్ అయ్యింది. ప్రతి రోజు 60 వేల మంది భక్తులు ఆలయాన్ని విజిట్ చేస్తారని, అక్కడ అధిక సంఖ్యలో టాయిలెట్లను నిర్మించాల్సిన అవసరం ఉందని అడ్వకేట్ జనరల్ అశోక్ కుమార్ పరిజా కోర్టులో వాదించారు. సంస్కృతి శాఖ అనుమతితోనే నిర్మాణం జరుగుతోందన్నారు. నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ(ఎన్ఎంఏ) ప్రకారమే నిర్మాణ పనులు ప్రారంభమైనట్లు చెప్పారు. నిర్మాణాలను వ్యతిరేకిస్తూ పిటిషన్ వేసిన ఇద్దరికీ చెరో లక్ష చొప్పున కోర్టు జరిమానా విధించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

