న్యూఢిల్లీ: ఆధార్ చట్టం వంటి చట్టాలను ద్రవ్య బిల్లు రూపంలో పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదం పొందుతుండటం సరైనదేనా? అనే అంశంపై దాఖలైన పిటిషన్లపై ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుచేయనున్నట్టు సుప్రీంకోర్టు శుక్రవారం తెలిపింది.
ప్రభుత్వానికి రాజ్యసభలో తగిన సంఖ్యాబలం లేనపుడు, అక్కడ ఆమోదం పొందడానికి శ్రమపడకుండా, ద్రవ్య బిల్లు రూపంలో కొన్ని బిల్లులను ఆమోదించారని పిటిషనర్లు వాదించారు.